కడప వైద్యులతో పాటు ఫోరెన్సిక్ నిపుణుచేత రంగన్న మృతి దేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. విజయవాడ, తిరుపతి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు, కడప రిమ్స్ వైద్య బృందం ఆధ్వర్యంలో పులివెందుల పోలీసులు.. పులివెందుల ఆర్డీవో సమక్షంలో మరోసారి పోస్టుమార్టం చేశారు. పూడ్చిపెట్టిన రంగన్న మృతదేహాన్ని వెలికి తీసి శరీరంపైన ఎక్కడైనా గాయాలు ఉన్నాయా? లేదా? అనే అంశంపై క్షుణ్ణంగా వైద్య బృందం పరిశీలించారు.