రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలం రంగాపూర్ శివారు దర్గా రోడ్డు మూల మలుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళుతున్న మహిళ, ఇద్దరు బాలురకు తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోని మృతి చెందారు. వీరు చంద్రయాన్ గుట్ట వాసులుగా గుర్తించారు. వీరిలో హజరత్ బేగం (35), అబ్దుల్ రహమాన్ (12) సంఘటన స్థలంలోని మృతి చెందినట్లు సానికులు తెలిపారు. రహీం (9) పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు.
రంగా రెడ్డి జల్లా రాజేంద్రనగర్ బుద్వెల్ లో గుప్త నిధుల కలకలం రేపిన విషయం తెలిసిందే. గుప్త నిధుల తవ్వకాలపై రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వివరణ ఇచ్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మా టీమ్ ఆ ఇంటి పై రైడ్ చేసిందన్నారు. తవ్వకాలు జరుపుతున్న సమయంలోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామన్నారు.
రంగా రెడ్డి జల్లా రాజేంద్రనగర్ బుద్వెల్ లో గుప్త నిధుల కలకలం రేపాయి. బుద్వేల్ అంజనేయ స్వామి దేవాలయం సమీపంలో నిధులు కోసం తవ్వకాలు చేస్తున్నట్లు పక్కా సమాచారం మేరకు రాజేంద్రనగర్ SOT పోలీసుల దాడులు నిర్వహించారు.
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారాల నివారణకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. ఒకప్పుడు రాబడి జరిగింది లక్షల్లో దోచుకున్నారు అనే రోజులు పోయారు.
రంగారెడ్డి జిల్లా అదిబాట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో లింగం అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం తన సమీప బంధువులకు అప్పు ఇవ్వడంతో.. వారు ఇప్పటికి తిరిగి ఇవ్వకపోవడంతో.. మనస్తాపం చెందిన లింగం ఆత్మహత్య చేసుకున్నాడు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. వాగు మరమత్తులు ఆగిపోవడంతో బైక్ పై వస్తున్న వ్యక్తి అదుపుతప్పి బైక్ తో సహా వాగులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పిల్లోనీగుడా వాగులో చోటు చేసుకుంది. స్థానికులు అందించిన వివరాల ప్రకారం….కొత్తూరు మండలం మద్దూరు రాంసింగ్ తాండాకు చెందిన దేజ్యాగ అనే వ్యక్తి పాలమాకుల వెళ్లి తిరిగి వస్తుండగా పిల్లోనీగుడా వాగు వద్ద బైక్ అదుపుతప్పి…
తెలంగాణ వ్యాప్తంగా గులాబ్ తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది.. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో.. ఈ నెల 28, 29 తేదీల్లో రాష్ట్రంలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు.. రేపు, ఎల్లుండి జరగనున్న ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.. వాయిదా పడిన పరీక్షలు మరల…