Terrible inciden: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బాలుడిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. షాద్ నగర్ పట్టణం హాజీపల్లి రోడ్ లోని గుడిసెల వద్ద ఓ కుటుంబం నివాసం ఉంటుంది. అయితే ఇంటి పక్కనే పందులు పెంపకం నిర్వహిస్తున్నారు. కొద్దిరోజులుగా పందులను దొంగలనం చేయాలని ఎల్లయ్య అనే వ్యక్తి ప్లాన్ వేసుకున్నాడు. అక్కడికి ఎల్లయ్య అనే వ్యక్తి వచ్చి పందులను దొంగతనం చేయాలని ప్లాన్ వేసుకున్నాడు. నిన్న సాయంత్రం పందుల వద్దకు వచ్చాని ఎల్లయ్య అక్కడ ఎవరూ లేరని గమనించాడు. దొంగతనం చేసేందుకు ఇదే అసలైన సమయం అని భావించాడు. పందులను దొంగతనం చేశాడు. అయితే అక్కడే ఆరేళ్ల బాలుడు ఆడుకుంటున్నాడు. ఎల్లయ్య పందులను దొంగలించడం ఆ బాలుడు చూశాడు. తాను పందులను దొంగతనం చేశాడని స్థానికులకు బాలుడు ఎక్కడ చెప్తాడో అని భయంతో బాలుడిపై అక్కసు పెంచుకున్నాడు. బాలుడి దగ్గరకు వెళ్లి మాటలు కలుపుతూ ఎత్తుకున్నాడు. అంతే కాలుపట్టుకుని బడకేసి కొట్టాడు.
Read also: Balapur Ganesh Laddu: బాలాపూర్ లడ్డూ వేలంలో ఈ ఏడాది ఒక కొత్త రూల్.. ఏంటో తెలుసా?
ఒకటి కాదు రెండు కాదు బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడు మృతి చెండతో ఎల్లయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే అప్పుడే ఇంటికి వచ్చిన బాలుడి తల్లిదండ్రులు దుర్గయ్య, సాయమ్మలు బాలుడిని విగతజీవిగా చూసి షాక్ తిన్నారు. బాలుడిని గుండెక్కు హత్తుకు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాలుడ్ని ఎవరు? ఎందుకు చంపారన్నది తల్లిదండ్రులకు ప్రశ్నార్థంగా మారింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో వున్న ఎల్లయ్య పై అనుమానంతో అదుపులో తీసుకున్నారు. ఎల్లయ్యను ప్రశ్నించగా బాలుడిని చంపింది తనేనని ఒప్పుకున్నాడు. పందులు దొంగతనం చేస్తుండగా చూసాడనే కర్కసుతోనే బండకేసి చంపినట్లు వివరించాడు. దీంతో ఎల్లయ్యపై కేసు నమోదు పోలీస్టేషన్ కు తరలించారు.
Harassment: మేనల్లుడి వేధింపులపై ఫిర్యాదు.. యూపీ మహిళను కొట్టి, గుండు గీయించారు..!