Ranga Reddy Crime: రంగారెడ్డి జిల్లా అదిబాట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో లింగం అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం తన సమీప బంధువులకు అప్పు ఇవ్వడంతో.. వారు ఇప్పటికి తిరిగి ఇవ్వకపోవడంతో.. మనస్తాపం చెందిన లింగం ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. లింగం వారిని ఎన్ని సార్లు అప్పు ఇవ్వాలని అడిన సమీప బంధువులు స్పందించలేదు. డబ్బులు చేతిలేక తీవ్ర మనస్తాపం చెందిన లింగం చావే సరణ్యమని భావించాడు. మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులమంది తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
Read also: Kodandaram Deeksha: ఎన్నికల నిబంధనలు గాలికొదిలేశారు.. బుద్ధ భవన్ లో కోదండరాం మౌన దీక్ష
ఇంట్లో పెద్దదిక్కుగా వున్న లింగం ఆత్మహత్యతో కుటుంబం సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. గుండెలు పగిలేలా రోదించారు. పాపంకదా అని తోటి బంధువులే కదా అని డబ్బులు ఇస్తే ప్రాణాలు కోల్పోయాడే అంటూ కుటుంబసభ్యుల రోదనతో గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. అయితే కుటుంబసభ్యలు లింగం మృతదేహంతో అప్పు తీసుకున్న వ్యక్తుల ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. అప్పు ఇస్తారా లేక మృతదేహాన్ని మీ ఇంట్లోనే ఖననం చేయమంటారా అంటూ మృతదేహాన్ని ఇంటి ముందే వుంచి ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎంత చెప్పిన మృతిని బంధువులు ఆందోళన విరమించలేదు. ఉద్రికత్త పరిస్థితులు ఎదురవకుండా భారీగా పోలీసులు మోహరించారు.
Nayantara: నయన్, విగ్నేష్ సేఫ్.. రేపు ప్రభుత్వానికి కమిటీ నివేదిక