అ ఆ మూవీ తర్వాత నితిన్ కెరీర్ లో మరో చక్కని విజయాన్ని అందుకున్న సినిమాభీష్మనే. ఎన్నో పరాజయాల తర్వాత త్రివిక్రమ్ తెరకెక్కించిన అ ఆ నితిన్ కెరీర్ కు కొత్త ఊపిరి పోసినట్టుగా, లై, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాల పరాజయం తర్వాత నితిన్ కు భీష్మ మంచి విజయాన్ని అందించి, అతని ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ తర్వాత ఈ యేడాది వచ్చిన చెక్, రంగ్ దే చిత్రాలు…