సోనియా గాంధీ నివాసంలో కీలక భేటీ ముగిసింది. సుమారు 6 గంటలపాటు నేతల మధ్య సమాలోచనలు సాగాయి. వచ్చే రెండు, మూడు రోజుల్లో చర్చలు, సమాలోచనలు పూర్తవుతాయని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా తెలిపారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ప్రతిపాదనలతో పాటు, సంస్థాగతంగా, పాలనాపరంగా అనుభవం ఉన్న ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేశ్ భగేల్ అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరిగిందన్నారు. ప్రజల ఆశలకు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు…