హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో కిడ్నాపర్లు రెచ్చిపోయారు. హైదర్ గూడలో ఆడుకుంటున్న ఓ చిన్నారిని కిడ్నాప్ చేశారు కిడ్నాపర్లు. కాగా.. అక్కడున్న స్థానికులు గమనించి కిడ్నాపర్లను పట్టుకున్నారు. ఈ క్రమంలో.. వారికి దేహశుద్ధి చేశారు. కిడ్నాపర్లను ఓ స్తంభానికి కట్టేసి చితకబాదారు గ్రామస్తులు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు స్వైర విహారం చేసే వీడియో ఒకటి బయటపడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఓ వార్డులో ఎలుకలు తిరుగుతున్నట్లు కనపడే వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఈ ఘటనతో వైద్య సదుపాయంలో సమర్థవంతమైన పెస్ట్ కంట్రోల్‌ను ఆదేశించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను.. మధ్యప్రదేశ్‌లోని ప్రతిపక్ష కాంగ్రెస్ మంగళవారం తన X హ్యాండిల్‌లో షేర్ చేసింది. గ్వాలియర్‌లోని కమల రాజా ఆసుపత్రిలో "రోగుల…