మహేష్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు రమేష్. పలు సినిమాల్లో నటించిన రమేష్ బాబు మృతిచెందడంతో ఆయన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. రమేష్ హఠాన్మరణం పట్ల పలువురు సంతాపం తెలిపారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం చోటుచేసుకొంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ అన్న రమేష్ బాబు కొద్దిసేపటి క్రితం మృతిచెందారు. గతకొన్ని రోజుల నుంచి కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రమేష్ బాబును చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు సమాచారం. ఇకపోతే రమేష్ కూడా హీరోగా పలు సినిమాల్లో నటించారు. ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలో చిన్నప్పటి అల్లూరి సీతారామరాజుగా నటించి మెప్పించారు. “దొంగలకే…