Bihar: రామచరిత్ మానస్ మరోసారి వివాదాల్లోకి వచ్చింది. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య ‘రామచరిత మానస్’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. తాజాగా బీహార్ మంత్రి కూడా హిందూ గ్రంథాలపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పవిత్ర రామచరితమానస్ గ్రంథాన్ని విషపదార్థమైన ‘సైనైడ్’తో పోల్చాడు. ఆయన వ్యాఖ్యలపై ఇప్పుడు పొలిటికల్ దుమారం ప్రారంభమైంది.