BJP MP: పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత పలువురు రాజకీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా, బీజేపీ రాజ్యసభ ఎంపీ రామ్ చందర్ జాంగ్రా పహల్గామ్ ఉగ్రదాడిపై చేసిన కామెంట్స్‌పై వివాదం చెలరేగింది. ఉగ్రవాద దాడి సమయంలో మహిళలు తమ భర్తల ప్రాణాల కోసం వేడుకునే బదులుగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడి ఉండాల్సిందని ఆయన అనడం రాజకీయ దుమారాన్ని రేపింది.