శ్రీశ్రీశ్రీ రామానుజాచార్య 216 అడుగుల ఎత్తైన విగ్రహం ఫిబ్రవరి 5న ప్రపంచానికి అంకితం కానున్నది. కూర్చున్న స్థానంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహంగా పేర్కొనబడిన ఈ విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నట్లు చిన జీయర్ స్వామీజీ ఆశ్రమం ఓ ప్రకటన విడుదల చేసింది. విడుదల చేసిన ప్రకటన ప్రకారం, నగర శివార్లలోని 45 ఎకరాల కాంప్లెక్స్ వద్ద, రూ. 1,000 కోట్ల ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుండి వచ్చిన విరాళాల ద్వారా నిధులు సమకూర్చబడింది.…
రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు తమిళనాడు గవర్నర్ R.N.రవిని భగవత్ ను ఆహ్వానించారు. ఈరోజు చెన్నైలోని గవర్నర్ నివాసానికి వెళ్లిన చిన్నజీయర్ స్వామి.. ఆహ్వాన పత్రికను అందించారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు 1,035 కుండ శ్రీ లక్ష్మీ నారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ట కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ జరగనుంది. ఫిబ్రవరి 14న పూర్ణాహుతిలో రాష్ట్రపతి పాల్గొనబోతన్నారు. ఇప్పటికే చిన్నజీయర్ స్వామి దేశవ్యాప్తంగా ఉన్న…
ముచ్చింతల్ ఆశ్రమంలో జరిగిన గోదా దేవి కల్యాణంలో పాల్గొన్న శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి. కల్యాణ అనంతరం శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 5న ప్రధాని ఆశ్రమంలో జరిగే రామానుజ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. వేదికలో మూడు తలాలు ఉన్నాయి. మద్య తలంలో బంగారు విగ్రహాన్ని ఫిబ్రవరి 13న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రతిష్ట చేస్తారని చెప్పారు. ఫిబ్రవరి 14న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం తరుపున అన్ని పనులు చేయడానికి…