కరీంనగర్ లోని వికాస తరంగిణి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణంలో త్రిదండి చిన్నజీయర్ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దర్శించుకున్నారు.
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచల క్షేత్రంలో ఇవాళ సీతారాముల కల్యాణం వైభవంగా కొనసాగింది. కల్యాణం సందర్భంగా సీతారామచంద్రస్వామి వారికి తెలంగాణ సర్కార్ తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించింది.