Sri Rama Navami: భద్రాచలంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచల క్షేత్రంలో ఇవాళ సీతారాముల కల్యాణం వైభవంగా కొనసాగింది. కల్యాణం సందర్భంగా సీతారామచంద్రస్వామి వారికి తెలంగాణ సర్కార్ తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించింది. తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం నాడు తెల్లవారు జామునే రామయ్య సుప్రభాత సేవను ఆలయ అర్చకులు జరిపారు. ఆ తర్వాత తిరువారాధన, ఆరగింపు, మంగళ శాసనం, అభిషేకం ఆ తర్వాత ధ్రువమూర్తులకు కల్యాణ వేడుక నిర్వహించారు. అనంతరం కల్యాణ మూర్తులను పల్లకీలో ఉంచి మంగళవాయిద్యాల మధ్య మిథిలా మైదానంలోని కల్యాణ మండపానికి తీసుకెళ్లారు.
Read Also: UNFPA Report : 77 ఏళ్లలో భారత జనాభా రెట్టింపు.. నివేదికలో ఐక్యరాజ్యసమితి వెల్లడి
Also Read
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
ఇక, కల్యాణం సందర్భంగా సంప్రదాయబద్ధంగా భక్త రామదాసు చేయించిన పచ్చల పతకం, చింతాకు పతకం, కలికితురాయి, రామమాడ తదితర ఆభరణాలను శ్రీ రాముడికి, సీతమ్మకు, లక్ష్మణుడికి అర్చకులు ధరింపజేశారు. కొత్త దంపతులైన శ్రీ సీతారామచంద్రమూర్తులకు అర్చకులు నూతన వస్త్రాలను అలంకరించారు. అభిజిత్ లగ్నం సమయంలో సీతారాముల ఉత్సవమూర్తుల శిరసుపై జీలకర్ర బెల్లం ఉంచి.. ఆ తర్వాత భక్త రామదాసు చేయించిన మంగళ సూత్రాలతో మాంగళ్య ధరణ, తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. ఇక, సీతారాముల కల్యాణ వేడుకలో వేలాది మంది భక్తులు వీక్షించారు. కల్యాణం జరిగిన మిథిలా మైదానంతో పాటు ఆలయ పరిసరాలన్నీ రామనామస్మరణతో మార్మోగిపోయాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం నాడు శ్రీరాముడి పట్టాభిషేక కార్యక్రమం జరగనుంది. అలాగే, రాములోరి కళ్యాణ వేడుకలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ పాల్గొన్నారు. ఎలాంటి ప్రొటోకాల్ లేకుండా.. సామాన్య భక్తుల్లా రాములోరి కళ్యాణాన్ని తిలకించారు.
తాజావార్తలు
-
Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
-
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
ట్రెండింగ్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?