తెలుగు చిత్రసీమలో కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు తమ బ్యానర్ లోగోలో మహానటుడు నటరత్న యన్.టి.రామారావు బొమ్మను పెట్టుకొని తమ అభిమానం చాటుకున్నాయి. పుండరీకాక్షయ్యకు చెందిన తారకరామ పిక్చర్స్ లోగోలో యన్టీఆర్ శ్రీరాముని గెటప్ లో కనిపిస్తారు. ఇక సి.అశ్వనీదత్ తమ వైజయంతీ మూవీస్ బ్యానర్ లోగోలో పాంచజన్యం పూరిస్తోన్న శ్రీకృష్ణునిగా యన్టీఆర్ బొమ్మనే పొదువుకున్నారు. అదే తీరున యన్టీఆర్ అభిమాని అయిన దర్శకుడు వై.వి.యస్. చౌదరి తాను నిర్మాతగా మారి ‘బొమ్మరిల్లు’ పతాకంపై తొలి ప్రయత్నంగా…