Hindupuram YSRCP Leader Killed: హిందూపురం నియోజకవర్గంలో శనివారం రాత్రి దారుణహత్య చోటు చేసుకుంది. వైసీపీ అసమ్మతి నేత, మాజీ సమన్వయకర్త చౌలూరు రామకృష్ణారెడ్డి (46) గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. రామకృష్ణారెడ్డి స్వగ్రామమైన చౌళూరు సమీపంలో కర్ణాటక సరిహద్దు వద్ద దాబా నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి దాబా మూసేసి కారులో ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మాటువేసిన దుండగులు రామకృష్ణారెడ్డి కారు దిగడంతోనే ఆయన కళ్లలో కారం కొట్టి వేట…