రామాయణం మనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తుంది. మంచికి, చెడుకు మధ్య తారతమ్యాన్ని.. చెడు చేసిన వాళ్లను క్షమించగలిగే గుణాన్ని మనకు నేర్పిస్తుంది. అంతేకాకుండా ఒంటరిగా అనుకున్నది సాధించలేని సమయంలో ఇతరుల సహాయం మనకు ఎంతో ఉపకరిస్తుంది. ముఖ్యంగా రామాయణం భార్యాభర్తల మధ్య బాంధవ్యం గురించి వర్ణిస్తుంది. ప్రస్తుతం సమాజంలో ప్రియుడి కోసం భర్తను భార్యలు హత్య చేయడం, ప్రేయసి మోజులో పడి భార్యను హతమార్చడం లాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి.
దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు "శ్రీ రామ నవమి"గా పూజలు జరుపుకుంటుంటాం.