టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్స్ లో ఒకడైన రామ్ పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు, స్కూల్ మేట్ అయిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న వీళ్లిద్దరు.. పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు సైతం వీరి నిర్ణయంతో ఏకీభవించడంతో, పెళ్లి కార్యక్రమాల్ని మొదలుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది. ఆగష్టు నెల శ్రావణ మాసంలో నిశ్చితార్థం జరగొచ్చని, నవంబర్ నెల కార్తిక మాసలో పెళ్ళి నిశ్చయించొచ్చని తెలుస్తోంది. త్వరలోనే…