Gyanvapi mosque: భారత పురావస్తు సర్వే (ASI) మాజీ ప్రాంతీయ డైరెక్టర్ కెకె ముహమ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో గత కొంత కాలంగా కొనసాగుతున్న మందిర్ - మసీద్ వివాదంపై స్పందించారు. ఈ వివాదంపై సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. రామ జన్మభూమి, మధుర, జ్ఞానవాపి మూడు స్థలాలు మాత్రమే చర్చకు కేంద్రంగా ఉండాలని కోరారు. హిందువులు మరిన్ని డిమాండ్లు చేయకుండా ఉండాలంటే ముస్లింలు ఈ ప్రాంతాలను ఇష్టపూర్వకంగా అప్పగించాలని సూచించారు.
నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి మరోసారి రాముడి జన్మస్థలంపై చర్చను ప్రారంభించారు. రాముడు, శివుడు, విశ్వామిత్రుడు వంటి దేవతలు నేపాల్ లోనే పుట్టారని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాఠ్‌మాండులో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఓలి పాల్గొని ప్రసంగించారు. శ్రీరాముడు నేపాల్ లోనే జన్మించాడని పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని ప్రచారం చేయడంతో దేశ ప్రజలు వెనకడుగు వేయొద్దన్నారు.
ఈ రోజు రామ నవమి పండుగ. అయోధ్యలోని భవ్యమైన రామాలయంలో వేడుకలు జరుగుతున్నాయి. రామనగరి శ్రీరాముని జయంతి ఆనందంలో మునిగిపోయింది. రామాలయంతో పాటు, అయోధ్యలోని అన్ని ఆలయాలను పూలతో అలంకరించారు. అయోధ్యకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయోధ్యా నగర వైభవం భిన్నంగా కనిపిస్తుంది. పుట్టినరోజు వేడుకలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యాయి.
Salman khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ సికిందర్ కోసం వరుసగా ప్రమోషన్లు చేస్తున్నాడు. డైరెక్టర్ ఏ.ఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. దీన్ని బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా విడుదల చేయబోతున్నారు. ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ఈ…
Ram Mandir : జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని పవిత్రోత్సవం జరగనుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే అతిథుల కోసం కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు.
ఈరోజు ఉదయం కరీంనగర్ లోని చైతన్యపురిలో ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురి ఇండ్లకు వెళ్లి స్వయంగా శ్రీరాముడి అక్షింతలను అందజేశారు.
Rajnath Singh: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని గురుద్వారా అలంబాగ్‌లో శనివారం జరిగిన గురు గ్రంథ్ సాహిబ్ ప్రకాష్ ఉత్సవ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిక్కు సమాజాన్ని ఉద్దేశిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అమోధ్యలో రామమందిరం కోసం దేశంలోని సిక్కు సమాజం ఉద్యమాన్ని ప్రారంభించిందని ఆయన అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సిక్కు సమాజం ఎంతో కృషి చేసిందని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.
Ayodhya Mosque: అయోధ్యలో కొత్త మసీదు నిర్మాణానికి మార్గం సుగమం అయింది. మసీదు నిర్మాణానికి సంబంధించి తుది అనుమతులను అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ(ఏడీఏ) తుది క్లియరెన్స్ ఇచ్చింది. బాబ్రీ మసీదు-రామజన్మభూమి తీర్పులో సుప్రీంకోర్టు అయోధ్యలో ధన్నీపూర్ మసీదు నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చింది.