Salman khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ సికిందర్ కోసం వరుసగా ప్రమోషన్లు చేస్తున్నాడు. డైరెక్టర్ ఏ.ఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. దీన్ని బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా విడుదల చేయబోతున్నారు. ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ఈ టైమ్ లోనే సల్మాన్ ఖాన్ తాజాగా ఇన్ స్టాలో పోస్టు చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆయన రామజన్మభూమి ఎడిషన్ వాచ్ పెట్టుకుని కనిపించారు. ఈ ఫొటోలు క్షణాల్లోనే వైరల్ అయిపోయాయి.
Read Also : Milk Price Hike: కర్ణాటకలో పాల ధరల పెంపు.. లీటర్ పాలపై రూ. 4
సాధారణంగా సల్మాన్ ఎప్పుడూ ఇలాంటి వాచ్ లు పెట్టుకోలేదు. ఈ రామజన్మభూమి వాచ్ లిమిటెడ్ ఎడిషన్. ఈ వాచ్ లో రామజన్మభూమి, రాముడు, హనుమంతుడు, సీతాదేవి లాంటి సింబల్స్ ఉన్నాయి. దీని ఖరీదు రూ.61లక్షల దాకా ఉంటుంది. జాకోబ్ కంపెనీకి చెందిన ఈ ఎడిషన్ వాచ్ అతికొద్ది మంది మాత్రమే పెట్టుకుంటారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ చేతికి కనిపించడంతో దీనిపై చర్చ జరుగుతోంది. ప్రమోషన్ కోసమే ఇది పెట్టుకున్నాడంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు.