దర్శకుడు రాంగోపాల్ వర్మకు మరోసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.. ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. రాంగోపాల్ వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు పొడిగించింది.. గతంలో ఇచ్చిన ఆదేశాలను మళ్లీ శుక్రవారం వరకు పొడిగిస్తూ ఆదేశాలిచింది.. ఇక, ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ జరపనుంది ఏపీ హైకోర్టు..
పుష్ప-2 టికెట్ ధరలు ఎక్కువ అంటున్న వాళ్లకు వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ కౌంటర్ ఇచ్చాడు. పుష్ప టికెట్లను డిమాండ్ ఉన్న ఇడ్లీలతో పోలుస్తూ ‘సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి , ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు.…
ఎన్టీవీ కి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నా న్యూస్, థంబ్నెయిల్ బెటర్ గా ఉండాలని ఆయన కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఉన్న మీడియా పరిస్థితుల గురించి ఆయన మాట్లాడుతూ ఈ మేరకు కామెంట్ చేశారు. నా న్యూస్ బెటర్ గా ఉండాలి నా థంబ్నెయిల్ బెటర్ గా ఉండాలి అని అనుకునే కాంపిటీషన్లో ఇప్పుడు మనం ఉన్నాం. అప్పుడే జనం అట్రాక్ట్ అవుతారు అనే ప్రపంచంలో మనం ఉన్నాం అని…
ఏపీ పోలీసులకు చిక్కకుండా రామ్ గోపాల్ వర్మ తప్పించుకు తిరుగుతున్నారా అనే ప్రశ్నకు ఎన్టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ సమాధానం ఇచ్చారు. గత కొద్దిరోజులుగా రాంగోపాల్ వర్మ తప్పించుకు తిరుగుతున్నారు అని ప్రచారం జరుగుతోంది. కాబట్టి మీరు ఇప్పుడు ఎక్కడ నుంచి వస్తున్నారు అని యాంకర్ ప్రశ్నించగా తాను తన నివాసమైన డెన్ నుంచే వస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే జరుగుతున్న ప్రచారం అంతా నిజం కాదా? రాంగోపాల్ వర్మ తప్పించుకు తిరుగుతున్నాడు అనే ప్రచారం…
గతంలో వ్యూహం అనే సినిమా చేసిన సమయంలో రామ్ గోపాల్ వర్మ ప్రమోషన్స్ కోసం కొన్ని ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లు ఇప్పుడు ఆయన కొంప ముంచాయి. వరుసగా ఆయన మీద ఏపీలో కేసులు నమోదు అవుతున్నాయి. ఏపీ పోలీసులు రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ కూడా వచ్చారు. అయితే వర్మ అందుబాటులో లేకపోవడంతో తిరిగి వెళ్లారు. అయితే వర్మ ఇప్పుడు వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఎన్టీవీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన…
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ కేసులకు భయపడి పారిపోయాడు అని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లను కించపరిచేలా సినిమాలు తీశాడని.. ఇప్పుడు కేసులకు భయపడి అడ్రెస్ లేకుండా దాక్కున్నాడన్నారు. ఇప్పుడు దాక్కున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ, వై.ఎస్.అవినాష్ రెడ్డిల గురించి సినిమా తీయరా? అని ఆర్జీవీని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. తల్లి, కూతుళ్లను వదిలేసిన వర్మను వెనుకేసుకొచ్చి మాట్లాడతావా అంటూ మాజీ…
ఏపీలో తనపై కేసుల నమోదుపై ఆర్జీవీ వరుస ట్వీట్లు.. 22 పాయింట్లు లేవనెత్తిన వర్మ.. నా కేసు-RGV అంటూ ట్విట్టర్ (ఎక్స్)లో పోస్టు పెట్టిన ఆయన.. జాతీయ మీడియాతో పాటు తెలుగు మీడియాను ట్యాగ్ చేస్తూ.. 22 పాయింట్లు లేవనెత్తారు..
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. తాను ఎక్స్‌లో పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని, చట్టవిరుద్ధంగా ఒక విషయంపై ఇన్ని కేసులు పెట్టడం సమంజసం కాదని ఆర్జీవీ పిటిషన్ వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధమని, ఇకపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పటివరకు తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని ఆర్జీవీ కోరారు. ఈరోజు ఆర్జీవీ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు…
RGV : వివాదాలకు కేరాఫ్ అడ్రస్, ప్రముఖ డైరెక్టర్ ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ చేయనుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. మొత్తం మూడు పిటిషన్లు దాఖలు చేశారు వర్మ.. ప్రకాశం జిల్లా, విశాఖ జిల్లా, గుంటూరు జిల్లాల్లో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ.. హైకోర్టు మెట్లు ఎక్కారు వివాదాస్పద దర్శకుడు.. అన్ని పిటిషన్లపై నిన్న ఒకేసారి విచారణ చేపట్టిన హైకోర్టు ఈరోజుకు వాయిదా వేసింది. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ…
RGV : ఏపీ పోలీసుల గాలింపుపై డైరెక్టర్ RGV స్పందించారు. ఈ కేసులకు నేనే భయపడడం లేదు అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు ఆర్జీవీ. మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో వర్మపై అభ్యంతరకర పోస్టుల కేసు నమోదైంది. టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, రామ్ గోపాల్ వర్మ తన సినిమా వ్యూహం ప్రచారం సమయంలో వైసీపీ ప్రభుత్వాన్ని తక్కువచేసేలా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అలాగే, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్…