కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ‘పునీత్ రాజ్‌కుమార్‌ది ఆకస్మిక మరణం. మనలో ఎవరైనా.. ఎప్పుడైనా చనిపోవచ్చు అనేది భయంకరమైన నిజం. కాబట్టి మనం జీవించి ఉండగానే ఫాస్ట్ ఫార్వార్డ్ మోడ్‌లో జీవించడం ఉత్తమం. మరణానికి ఎలాంటి పక్షపాతం లేదు. అది ఎవరినైనా తన ఇష్టానుసారంగా తీసుకుపోతుంది. చావు అందరికీ సమానమే’ అంటూ తనదైన స్టైలులో…
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ రావడంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ తరఫున బాంబే హైకోర్టులో సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదించారు. దేశంలో ఆయన చాలా ఫేమస్ లాయర్. అటార్నీ జనరల్‌గానూ పనిచేశారు. ఈ నేపథ్యంలో ముకుల్ రోహత్గీ వంటి లాయర్ వాదించబట్టే ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ వచ్చిందని దర్శకుడు వర్మ అభిప్రాయపడ్డాడు. Read Also:…
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ మూవీకి ‘కొండా’ అని నామకరణం కూడా చేశాడు. ఈ సినిమా నేపథ్యం వరంగల్ జిల్లా కాబట్టి ఎక్కువ భాగం సినిమా షూటింగ్‌ను వరంగల్, ఆ జిల్లా పరిసర ప్రాంతాల్లో జరపాలని తొలుత నిర్ణయించారు. కానీ ఈ సినిమాపై పలువురు రాద్ధాంతాలు చేస్తున్నందున తాజాగా షూటింగ్ స్పాట్ మార్చినట్లు వర్మ తెలిపాడు. Read Also: ఒకేసారి నాలుగు…
పాకిస్తాన్ జట్టు పై ఇండియా గెలిచి ఉంటే ఇలాగే చెబుతారా? అంటూ ఢిల్లీ సీఎంను రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దుబాయ్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీమిండియా పాక్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. నిన్నటి ఘోర ఓటమితో 45 ఏళ్ళ పాటు కొనసాగిన రికార్డు చెరిగిపోయింది. దీంతో క్రికెట్ ప్రియులు కోహ్లీ సేన పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్…
వివాదాస్పద సినిమాలు తీస్తూ ఎప్పుడూ బీజీగా ఉండే డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా కొండామురళికి బర్త్ డే విషెస్ తెలిపారు. ‘కొండా మురళి గారికి, కొండా చిత్ర యూనిట్ నుంచి, మరియు నల్ల బల్లి సుధాకర్ గారి నుంచి, జన్మ దిన శుభాకాంక్షలు’ అంటూ ట్విట్ చేశారు. ప్రస్తుతం కొండా అనే టైటిల్ తో కొండా మురళిపై ఆర్జీవీ సినిమా షూటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్ కౌంటర్ చేయబడ్డ ఆర్కే అలియాస్ రామకృష్ణకు…
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది వివాదాస్పదం అవ్వడమే కాకుండా సంచలనంగా మారుతుందన్న విషయం తెలిసిందే. నిజానికి వివాదాలతోనే ఆయన సినిమాలకు హైప్ క్రియేట్ చేసి పబ్లిసిటీని పెంచుకుంటారు. ప్రస్తుతం ఆయన కొండా దంపతుల జీవితం ఆధారంగా ఒక సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఈ సినిమాను ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆపలేరంటూ అప్పుడే వార్నింగ్ కూడా ఇచ్చారు ఆర్జీవీ. Read Also : పారితోషికం…
సంచలనాలకు మరియు వివాదాలకు కెరాఫ్ అడ్రస్ రామ్‌గోపాల్ వర్మ. ఎప్పుడూ ఏదో ఒక వివాదం పై వార్తల్లో నిలుస్తారు రామ్‌గోపాల్ వర్మ. అయితే.. తాజాగా ఈ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కొండా చిత్రం కోసం వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న ఆర్జీవీ… వంచనగిరి గ్రామంలోని గండి మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సమయంలో అమ్మవారికి మద్యం తాగించారు. అక్కడి సంస్కృతి ప్రకారం గండి మైసమ్మ అమ్మవారికి మందు తాగించారు. ఆ…
(అక్టోబర్ 9తో ‘క్షణ క్షణం’కు 30 ఏళ్ళు)తొలి చిత్రం ‘శివ’తోనే దర్శకునిగా తానేమిటో నిరూపించుకున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆ పై రెండో సినిమాగా హిందీలో ‘శివ’ను రీమేక్ చేశారు. ఆ సినిమాకు అంతకు ముందు హిందీలో వచ్చిన సన్నీ డియోల్ ‘అర్జున్’కు పోలికలు ఉన్నా, రామ్ గోపాల్ వర్మ టేకింగ్ ను బాలీవుడ్ జనం సైతం మెచ్చారు. అలా ఆల్ ఇండియాలో పేరు సంపాదించిన రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రెండవ తెలుగు చిత్రం ‘క్షణ…
(అక్టోబర్ 7న దర్శకులు శివ నాగేశ్వరరావు పుట్టినరోజు) ‘నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు’ అంటారు. ‘నవ్విస్తూ తానవ్వక ఒప్పిస్తూ తిరుగువాడు శివనాగేశ్వరరావు’ అంటారు తెలుగు సినిమా జనం. దర్శకుడు శివనాగేశ్వరరావును చూస్తే ‘ఈయనేనా… ‘మనీ’లాంటి నవ్వుల నావను నడిపించింది…’ అన్న అనుమానం కలుగుతుంది. ఆయనలో అంత ‘హ్యూమర్’ ఉందని నమ్మబుద్ధి కాదు. కానీ, ఒక్కసారి శివనాగేశ్వరరావుతో మాట్లాడితే తాను నవ్వకుండానే మన పొట్టలు చెక్కలు చేసేస్తూ ఉంటారు. ఆయన తీరిక సమయంలో, మనకు ఓపిక ఉండాలే…
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గతంలో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ గ్రౌండ్ లో రక్తచరిత్ర రెండు పార్టులుగా తెరకెక్కించిన విషయం తెలిసిందే.. ఇప్పుడు తెలంగాణ రక్తచరిత్రను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈమేరకు ‘కొండా’ పేరుతో ఓ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు. కాంగ్రెస్ నేతలు కొండా మురళీధర్ రావు, సురేఖ దంపతుల జీవితాన్ని ఆర్జీవీ వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఆర్కె అలియాస్ రామకృష్ణ పాత్రలు కీలకంగా ఆయన ఈ సినిమాను రూపొందించనున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ వరంగల్ పరిసర…