సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఒక పథకం ప్రకారం’. వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ వినోద్ విజయన్ తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రామ రావణ తరహా పాత్రలో సాయిరామ్ శంకర్ నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ పోస్టర్ ను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. సినిమా కాన్సెప్ట్ ను పోస్టర్…
రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడంటే వివాదాలతో ఫేమస్ అయ్యాడు కానీ.. అప్పట్లో వర్మ తీసిన సినిమాలు ఏ డైరెక్టర్ తీయలేదనే చెప్పాలి. హార్రర్ చిత్రాలు తీయడంలో వర్మ తరువాతే ఎవరైనా.. వర్మ తీసిన దెయ్యం సినిమా ఇప్పుడు 3డీలో హర్రర్ సినిమాలు చూస్తున్నవారికి చూపిస్తే జడుసుకోక మానరు. జెడి చక్రవర్తి, మహేశ్వరి, జయసుధ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజుల్లో భారీ విజయాన్ని అందుకొంది. అయితే ఆ సమయంలో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్…
సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని క్యాసినో నిర్వహించారని రెండు రోజులుగా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గుడివాడలో క్యాసినో వ్యవహారంపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. గుడివాడ ఆధునీకరణకు శ్రీకారం చుట్టిన మంత్రి కొడాలి నానికి తాను పూర్తిగా మద్దతు తెలుపుతున్నానని… క్యాసినోకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారంతా పూర్వీకులు అని.. వారికేం తెలియదని వర్మ సెటైర్లు…
పొద్దున్నే ప్రముఖ దర్శకనిర్మాత రామ్ గోపాల్ వర్మ దృష్టి, స్టార్ కపుల్ ధనుష్, ఐశర్వ విడాకుల మీద పడినట్టుగా ఉంది. సహజంగా పెళ్ళంటే పడని వర్మ ఎప్పటిలానే పెళ్ళి – దాని పర్యవసానాలపై నాలుగైదు ట్వీట్స్ పెట్టేశాడు. బట్ ఆ పోస్టులు, దానికి వచ్చిన స్పందన వర్మకు పెద్దంత కిక్ ఇచ్చినట్టు లేవు. ఇక మెగా ఫ్యామిలీ మీద పడ్డాడు. ‘అంగీకరించడానికి కష్టంగా ఉన్నా ఇక ‘అల్లు’ అనేది కొత్త ‘మెగా’! అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో…
సాధారణంగా పండగకు ప్రతి ఒక్కరు అందరు బాగుండాలని కోరుకుంటారు. తమ జీవితంలో మంచి రోజులు రావాలని, ఐశ్వర్యారోగ్యాలు ఉండాలని, తమతో పాటు అందరు కూడా బావుండాలని కోరుకుంటారు. మంచి తెలుస్తూనే శుభాకాంక్షలు తెలుపుతారు. అయితే అందరిలా చెప్తే తనకు వాల్యూ ఏముంటది అనుకున్నాడో.. లేక నా తీరే ఇంత అని మరోసారి నిరూపిద్దామనుకున్నాడో.. వివాదాల దర్శకుడు వెరైటీగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపాడు. ” అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భగవంతుడు మీలో ప్రతి ఒక్కరికి పెద్ద ఇల్లు…
అప్ టిక్కెట్ల వ్యవహారంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పట్లో తగ్గేలా కన్పించడం లేదు. ట్విట్టర్ లో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో వార్ తరువాత ఆయనను కలవడానికి అనుమతి అడిగాడు. ఆయన కూడా సరేనని చెప్పడంతో నిన్న ఏపీ సచివాలయంలో ఆయనను కలిసి మాట్లాడారు. అయితే ఆర్జీవీ, పేర్ని నాని భేటీతో టాలీవుడ్ కు, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన గ్యాప్ ఏమన్నా తగ్గుతుందేమో అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే అలా…
టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ నిత్యం సోషల్ మీడియాలో కనిపించకపోయినా అవసరమైన సమయంలో అవసరమైన విషయాలపై తనదైన స్పందన తెలియజేస్తూ ఉంటారు. తన సినిమా అప్డేట్స్ తో పాటు కొన్ని సమస్యలపైకూడా ఆయన తన గొంతును వినిపిస్తారు. ఇక తాజాగా హరీష్ వేసిన ట్వీట్ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఊసుపోక.. అలోచించి వేసిన ట్వీట్ అని ఆయన చెప్పుకొస్తున్నా.. అది ఎవరికో స్ట్రాంగ్ కౌంటర్ అని నెటిజన్లు నొక్కి వక్కాణిస్తున్నారు. ” ఒక్క సారి క్యాచ్ ఇచ్చాక…
టాలీవుడ్లో నెలకొన్ని సినిమా టిక్కెట్ ధరలపై మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సోమవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 1955 సినిమాటోగ్రఫీ చట్ట ప్రకారమే సినిమా టిక్కెట్ ధరలు ఉన్నాయని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. 1955 నుంచి అదే జరుగుతోందని… తాము కొత్తగా సృష్టించిందేమీ లేదన్నారు. రామ్‌గోపాల్ వర్మ తాను చెప్పాల్సింది చెప్పారని.. అన్నీ వివరంగా విన్నానని తెలిపారు.…
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు వీరి సమావేశం జరిగింది. అనంతరం ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ… మంత్రి పేర్ని నానితో చర్చలు సంతృప్తికరంగా ముగిశాయన్నారు. సినిమా టిక్కెట్ రేట్లపై తన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చెప్పానని… ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్లు రామ్‌గోపాల్ వర్మ తెలిపారు. Read Also: ప్రభాస్… హాలీవుడ్ హీరో అనిపించుకుంటాడా? సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గిస్తే సినిమా క్వాలిటీ…
ఏపీలో సినిమా టికెట్ రేట్ల విషయంపై తాజాగా ఆర్జీవీ, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటీ అటు సినిమా, ఇటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ఏపీ సచివాలయానికి చేరుకున్న ఆర్జీవీ మంత్రి పేర్ని నాని ఛాంబర్ లో కలిసి మాట్లాడుతున్నారు. గంట నుంచి కొనసాగుతున్న ఈ మీటింగ్ లో టికెట్ల రేట్ల తగ్గింపు వల్ల థియేటర్ యాజమాన్యాలకు నష్టం వాటిల్లుతుందని, ట్విట్టర్ వేదికగా తాను చెప్పిన అంశాలపై…