వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. వోడ్కా మత్తులో ఆర్జీవి చేసే రచ్చ గురించి అస్సలు మాట్లాడుకొనవసరం లేదు. అమ్మాయిలు, వివాదాలు ఆర్జీవీ కి కొత్తేమి కాదు. ఎదురుగా ఎవరున్నా… ఆ ప్రదేశం ఏదైనా వర్మ చేసేది చేసేస్తాడు. ఇటీవల ఎక్కువగా పబ్ లో పార్టీలు చేస్తూ.. హీరోయిన్లను మత్తులో ఎక్కడ పడితే అక్కడ తాకుతూ అసభ్యంగా ప్రవరిస్తూ అందరి చేత విమర్శలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరోసారి ఆర్జీవీ రెచ్చిపోయాడు.
పబ్ లో వోడ్కా తాగుతూ, చేతిలో సిగరెట్ తో తూలుతూ కనిపించాడు. అంతేకాకుండా నటి ఇనయా సుల్తానాను పట్టుకొని, ముద్దుపెడుతూ ఎక్కడ పడితే అక్కడ తాకుతూ రచ్చరచ్చ చేశాడు. గతంలో ఈమె బర్త్ డే పార్టీలో వర్మ చేసిన రచ్చ అందరికి తెలిసిందే. వీటికి సంబంధించిన వీడియోలను ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఏదిఏమైనా బతికితే వర్మలా బతకాలి.. అని కొందరు.. ఛీఛీ వర్మ నీది ఒక బ్రతుకేనా అని మరికొందరు ఏకిపారేస్తున్నారు.