Home
Ram Charan
Ram Charan News
-
Peddi : పెద్ది పోస్ట్ పోన్ కాదని చెప్పండి : రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలు భారీగా పెరిగాయి. అయితే, గత కొన్ని రోజులుగా ఈ చిత్రం విడుదల తేదీ విషయంలో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 30 నుంచి వాయిదా పడిందని వస్తున్న వార్తలపై స్వయంగా రామ్ చరణ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. Also Read… -
Peddi : రామ్ చరణ్ పెద్ది వాయిదా ఫిక్స్.. అసలు కారణం ఏంటంటే
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది‘పై భారీ అంచనాలు ఉన్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేసున్నామని ప్రకటించారు మేకర్స్. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉంది. ఈ వాయిదా వెనుక బలమైన కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. కేవలం కొంత… -
Peddi Glimpse Review: ఆ బాడీ ఏంట్రా బాబు, అస్సలు ఊహించ లేదు.. ఇది అసలైన బర్త్‌డే ట్రీట్ చరణ్ అన్న!
Ram Charan’s Peddi Pehelwan Glimpse Review: ‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘పెద్ది’. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఉత్తరాంధ్ర నేపథ్యంతో స్పోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ది నుంచి గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘పెద్ది పహిల్వాన్’ పేరుతో… -
Peddi Pehelwan Glimpse: ‘పెద్ది’ గ్లింప్స్ విడుదల.. ‘ఆటే నా పొగరు’ డైలాగ్‌కు ఫ్యాన్స్ ఫిదా, గూస్ బంప్స్ తెప్పిస్తున్న చరణ్ విన్యాసాలు!
Ram Charan Peddi Pehelwan Glimpse Out: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రం నుంచి ఆసక్తికరమైన గ్లింప్స్ విడుదలైంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ స్పెషల్ ట్రీట్‌ను ఈరోజు అభిమానులకు అందించారు. విడుదలైన గ్లింప్స్‌లో చరణ్ పవర్ఫుల్ లుక్‌తో పాటు ఆయన డైలాగులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా పెద్ది, రామ్ చరణ్ నామస్మరణతో ఊగిపోతోంది. ‘పెద్ది… -
Megastar: రామ్ చరణ్ కంటికి సర్జరీ.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్!
Chiru-Charan: ‘పెద్ది’ సినిమా షూటింగ్లో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో, మెగా కుటుంబంతో పాటు అభిమానుల్లోనూ కొంత ఆందోళన నెలకొంది. అయితే, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఈ సర్జరీ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా డాక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ సమయంలో తమకు కలిగిన ఆందోళనను డాక్టర్ తన మాటలతో, పనితనంతో పోగొట్టారని ఆయన వివరించారు.”డాక్టర్ సుధాకర్ ప్రసాద్ గారు, చరణ్ కంటికి మీరు… -
Peddi: అనుకున్నదే అయిందా? వెనక్కి తగ్గిన పెద్ది, కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పెద్ది’ చిత్రం విడుదల తేదీపై మరోసారి సందిగ్ధత నెలకొంది. ముందుగా ఈ చిత్రాన్ని చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న విడుదల చేయాలని భావించినా, అది సాధ్యం కాకపోవడంతో అధికారికంగా ఏప్రిల్ 30, 2026కి వాయిదా వేశారు. అయితే, తాజా పరిణామాలు చూస్తుంటే ఈ తేదీ కూడా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వాయిదా పడబోతుందనే వార్తలకు ఊతమిస్తూ, ఓవర్సీస్ మార్కెట్లో… -
Peddi: గెట్ రెడీ గాయ్స్.. ‘పెద్ది’ కుస్తీ పట్టు చూస్తారా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా విలేజ్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ‘పెద్ది’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోగా, టాకీ పార్ట్ దాదాపు పూర్తయింది. ఒక స్పెషల్ సాంగ్ మినహా మిగిలిన పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. అయితే, తాజాగా రామ్ చరణ్ షూటింగ్లో గాయపడ్డారు. కంటి సమీపంలో చిన్న గాయం అవడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కానీ, ఎలాంటి టెన్షన్ అక్కర్లేదని పెద్ది టీమ్ తెలిపింది.… -
Ram Charan: పెద్ది షూటింగ్లో రామ్ చరణ్‌కు గాయం!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకుంది. ఏప్రిల్ 30న ఈ చిత్రం విడుదల కానుండగా.. వీలైనంత త్వరగా షూటింగ్ ఫినిష్ చేసేలా దూసుకుపోతోంది చిత్ర యూనిట్. ప్రజెంట్ హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఒక కీలకమైన యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో రామ్ చరణ్‌కు గాయం అయినట్టుగా తెలుస్తోంది.… -
Peddi: గెట్ రెడీ.. మెగా సెలబ్రేషన్స్‌కు సిద్ధమవండి!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో చరణ్ రఫ్ అండ్ మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా రెండో సింగిల్ ‘రై రై రా రా’ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించగా.. ముఖ్యంగా రామ్ చరణ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.… -
IPL 2026 vs Peddi: ఐపీఎల్ ఫీవర్ మధ్య రిలీజ్.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకి అసలైన పరీక్ష తప్పదా?
IPL 2026 vs Peddi: వేసవి సీజన్ అంటే సినిమాలకు మంచి సువర్ణావకాశం. ఎన్నో ఏళ్లుగా సమ్మర్ హాలిడేస్‌ను చాలా సినిమాలు టార్గెట్ చేస్తూ వచ్చాయి. అయితే కొన్నేళ్లుగా ఇదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా ప్రారంభం కావడంతో.. థియేటర్లపై పెను ప్రభావం పడుతోంది. సినిమాలకు ఇదేమీ కొత్త విషయం కాదు. అయితే ఏప్రిల్ 30న రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
CM Chandrababu: మురసు తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. 45 వేల మందికి పైగా అధికారులతో టెలికాన్ఫరెన్స్
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
SIR Protest: SIR పోరాటంలో కాంగ్రెస్ కొత్త ప్లాన్.. నవంబర్ 5న బెంగళూర్‌లో నిరసన!
-
Pulivendula Election Results: 43 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. పులివెందులలో ఎగిరిన టీడీపీ జెండా..
ట్రెండింగ్
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!