Peddi: స్పెషల్ “హీరోయిన్” కోసం ఫలించని ప్రయత్నాలు.. మరింత ఆలస్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ బడ్జెట్ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ విషయంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు మెగా ఫ్యాన్స్‌ను కాస్త టెన్షన్ పెడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ మరోసారి వాయిదా పడింది. ఈ వారం ఒక భారీ సెట్లో సినిమాలోని ఒక స్పెషల్ ఐటెం సాంగ్ షూట్ చేయాలని యూనిట్ ప్లాన్ చేసింది. ఈ సాంగ్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని భావించిన మేకర్స్, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కానీ, చివరి నిమిషంలో ఈ పాట చేసే హీరోయిన్ ఎంపిక ఇంకా కొలిక్కి రాకపోవడంతో షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది.
ఇప్పటికే మానస వారణాసి లాంటి కొందరు పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, సాంగ్ ఎనర్జీకి సరిపోయే సరైన హీరోయిన్ ను ఇంకా ఫైనల్ కాలేదు, ఆ అన్వేషణ కొనసాగుతోందని తెలుస్తోంది. మరోపక్క హీరో రామ్ చరణ్ తన వ్యక్తిగత పనుల నిమిత్తం చిన్న బ్రేక్ తీసుకున్నారు. కుటుంబంతో సమయం గడపడం కోసం ఆయన అందుబాటులో లేకపోవడంతో షెడ్యూల్ మొత్తం రీషెడ్యూల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చరణ్ బ్రేక్ నుంచి తిరిగి వచ్చాకే ఆ షూట్ మొదలుకానుంది. ఏదైనా సినిమా షూటింగ్ సాఫీగా సాగితేనే అవుట్‌పుట్ అద్భుతంగా వస్తుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. కానీ ‘పెద్ది’ విషయంలో జరుగుతున్న వరుస వాయిదాలు అభిమానులను టెన్షన్ పెడుతున్నాయి. ఒకవైపు ప్రొడక్షన్ కాస్ట్ పెరగడం, మరోవైపు సమయం వృథా కావడం వల్ల సినిమా విడుదల తేదీపై ప్రభావం పడే అవకాశం ఉంది.
Also Read
- Avengers Doomsday: ఒక రోజు ముందే ఇండియాలో ‘ఎవెంజర్స్ డూమ్స్‌డే’ రిలీజ్! రీజన్ ఇదేనా..
- Inji Vellam: చడీచప్పుడు లేకుండా షూటింగ్ ముగించేసిన మణిరత్నం! రిలీజ్ ఎప్పుడంటే?
- Mouli: ఫ్యూచర్ ప్రాజెక్టులపై యంగ్ హీరో బోల్డ్ కామెంట్స్!
- Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’ ఒరిజినల్ కాన్సెప్ట్ బయటపెట్టిన కార్తీక్ సుబ్బరాజ్!
తాజావార్తలు
-
Avengers Doomsday: ఒక రోజు ముందే ఇండియాలో ‘ఎవెంజర్స్ డూమ్స్‌డే’ రిలీజ్! రీజన్ ఇదేనా..
-
AP MPTC, ZPTC Elections Rescheduled: ఏపీలో MPTC, ZPTC ఎన్నికల రీషెడ్యూల్.. పూర్తి వివరాలివే..!
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Inji Vellam: చడీచప్పుడు లేకుండా షూటింగ్ ముగించేసిన మణిరత్నం! రిలీజ్ ఎప్పుడంటే?
-
Union Cabinet Decisions : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.29,267 కోట్ల కేటాయింపు
ట్రెండింగ్
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!