గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ పిఠాపురం వెళ్తున్నారు.. తన తల్లి సురేఖ, మామయ్య అల్లు అరవింద్‌తో కలిసి పిఠాపురం బయల్దేరారు.. ఇక, పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో తన బాబాయ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగిన విషయం విదితమే కాగా.. ఈ రోజుతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది.. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ అక్కడికి వెళ్తుండడంతో ఆసక్తికరంగా మారింది..