కొండ పొలం తర్వాత టాలీవుడ్‌కు దూరంగా ఉంటోన్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌కే పరిమితమైంది. అక్కడేమైనా హిట్స్ ఉన్నాయా అంటే అదీ లేదు. అప్పుడెప్పుడో 2019లో వచ్చిన దే దే ప్యార్ దే తర్వాత హిట్టు అనేది ఎట్టా ఉంటుందో మర్చిపోయింది అమ్మడు. కేవలం తమిళ డబ్బింగ్ చిత్రాలు అయలాన్, ఇండియన్2తో హాయ్ చెప్పేసి సరిపెట్టేస్తోంది రకుల్. అవి కూడా డిజాస్టర్లే. గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రకుల్.. కెరీర్ ఫేడటవుతౌన్న దశలో ఆచితూచి ప్రాజెక్టులు…