విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావును జనం ‘అన్న’గా అభిమానించారు, ఆరాధించారు, ‘అన్న’ అనే అభిమానంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయనను ముఖ్యమంత్రిగానూ నిలిపారు. అంతలా యన్టీఆర్ ‘అన్న’గా జనం మదిలో ముద్రవేశారు. అంతకు ముందు ఎన్ని చిత్రాలలో యన్టీఆర్ అన్న పాత్రల్లో నటించి అలరించినా, ఆయనకు ‘అన్న’గా తరిగిపోని, చెరిగిపోని స్థానం కల్పించిన సినిమా ‘రక్తసంబంధం’ అనే చెప్పాలి. అనేక చిత్రాలలో యన్టీఆర్ కు హిట్ పెయిర్ గా అలరించిన సావిత్రి, ఈ సినిమాలో ఆయనకు చెల్లెలుగా…
రచయితల టైటిల్ కార్డ్ చూసి కూడా జనం చప్పట్లు కొట్టే రోజులు అప్పట్లోనే ఉండేవి. అలా చప్పట్లు కొట్టించుకున్న రచయితల్లో త్రిపురనేని మహారథి సైతం చోటు సంపాదించారు. తెలుగు సినిమాల్లో ఒకప్పుడు ‘నేరుగా కథ చెప్పడమే’ ప్రధానంగా ఉండేది. కానీ, అందులోనూ స్క్రీన్ ప్లే ను చొప్పించి మరింత రంజింప చేయవచ్చునని కొందరు రచయితలు తలచారు. వీరందరూ పాశ్చాత్య చిత్రాల ప్రభావంతో అలా రాస్తున్నారనీ కొందరు విమర్శించేవారు. అయితే భవిష్యత్ లో ‘స్క్రీన్ ప్లే’కు విశేషమైన స్థానం…
ప్రముఖ నటి జ్యోతిక నాయికగా నటించిన చిత్రం ‘ఉడన్ పిరప్పు’. ఆమెకిది 50వ చిత్రం. 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్య, జ్యోతిక సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఎరా. శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జ్యోతిక, శశికుమార్, సముతిర ఖని కీలక పాత్రలు పోషించారు. డి. ఇమ్మాన్ సంగీతం సమకూర్చాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ట్రైలర్ ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ప్రధాన…