దేశంలో మహిళలపై వేధింపులు ఎక్కువైపోతున్నాయి. మహిళా రక్షణ కోసం కఠిన చట్టాలను తీసుకొస్తున్నప్పటికీ దారుణాలకు అడ్డుకట్ట పడడం లేదు. కొన్ని రోజుల క్రితం పూణేలో ఆగి ఉన్న బస్సులో ఓ మహిళపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈకేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా మహారాష్ట్రలో కేంద్ర మంత్రి కుమార్తెను కొందరు ఆకతాయిలు వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మహాశివరాత్రి జాతరలో తన కుమార్తెను కొంత మంది యువకులు వేధించారని ఆరోపిస్తూ పోలీసులకు…