Raksha Bandhan : రక్షా పౌర్ణమి సందర్భంగా రామాయంపేట బస్ స్టేషన్‌లో జరిగిన ఒక హృదయాన్ని హత్తుకునే సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కామారెడ్డి బస్ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న జి ఎస్ నారాయణ తన షెడ్యూల్ ప్రకారం ప్రయాణం చేస్తున్నపుడు రామాయంపేట వద్ద కొద్ది సేపు ఆగిన సందర్భంలో, అతని సోదరి శారద అక్కడికి వచ్చి తన సోదరుడికి రాఖీ కట్టింది. రక్షాబంధన్ పండుగ సమయంలో సెలవు తీసుకోకుండా విధులు నిర్వరిస్తున్న నారాయణ తన…
Hyd Traffic : రాఖీ పౌర్ణమి పండగను స్వగ్రామాల్లో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు నగర వాసులు పెద్ద ఎత్తున బయలుదేరడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. పండగ రద్దీ కారణంగా శనివారం ఉదయం నుంచే రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ శివార్లలోని వనస్థలిపురం, భాగ్యలత, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత తీవ్రంగా మారింది. ఒక్కసారిగా వేల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి రావడంతో ప్రధాన రహదారితో పాటు సర్వీసు రోడ్లు…
Nagula Panchami: తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ మాసం సందడి మొదలైంది. శ్రావణ మాసమంతటా పండుగల సందడితోనే సాగుతుంది. నేడు శ్రావణమాసం తొలి శుక్రవారం, నాగుల పంచమి పర్వదినం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
Rakhi Pournami Celebrations: వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఇంట్లో రాఖీ పండుగ సంబురాలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులతో పాటు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇంటి వద్దకు చేరుకొని సందడి చేశారు. మంత్రి హరీశ్ రావుకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సోదర సోదరీమణుల మధ్య అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని, రాష్ట్ర ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందరికీ రాఖీ…
దేశంలో రాఖీ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే ఈ రాఖీ పండుగ సంబురాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇళ్లల్లో రాఖీ పండుగ సందడి మొదలైంది. అయితే.. సోదరీమణులందరూ తమ సోదరులకు రాఖీ కట్టి ఆశీర్వచనాలు తీసుకుంటున్న క్రమంలో ప్రగతి భవన్‌లో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. తన సోదరుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈనేపథ్యంలో.. రాష్ట్ర ప్రజలందరికి ఎమ్మెల్సీ…
భారత సనాతన సంప్రదాయం ప్రకారం జంతువులను పూజించడం ఆచారం. దీనికి గల కారణం సమస్త జీవకోటిలోనూ ఈశ్వరుడు ఉన్నాడని విశ్వసిస్తారు. అంతేకాదు మానవుడి మనుగడ ఆరంభమైనప్పటి నుంచి జంతువులతో కలిసి జీవిస్తున్నాడు. ప్రకృతిని ఆరాధిస్తున్నాడు. అందులో భాగంగానే సర్పాలను కూడా పూజిస్తున్నాడు. అయితే.. వేదాల్లో నాగ పూజ కనిపించకున్న సంహితాల్లో, బ్రాహ్మణాల్లో నాగుపామును నాగరాజుగా, నాగదేవతగా పూజించే ప్రసక్తి. నాగుపాములను ముఖ్యంగా దీపావళి అమవాస్య తర్వాత వచ్చే కార్తిక శుద్ధ చవితి నాడు కొలుస్తారు. దీనినే నాగుల…