భారత సనాతన సంప్రదాయం ప్రకారం జంతువులను పూజించడం ఆచారం. దీనికి గల కారణం సమస్త జీవకోటిలోనూ ఈశ్వరుడు ఉన్నాడని విశ్వసిస్తారు. అంతేకాదు మానవుడి మనుగడ ఆరంభమైనప్పటి నుంచి జంతువులతో కలిసి జీవిస్తున్నాడు. ప్రకృతిని ఆరాధిస్తున్నాడు. అందులో భాగంగానే సర్పాలను కూడా పూజిస్తున్నాడు. అయితే.. వేదాల్లో నాగ పూజ కనిపించకున్న సంహితాల్లో, బ్రాహ్మణాల్లో నాగుపామును నాగరాజుగా, నాగదేవతగా పూజించే ప్రసక్తి. నాగుపాములను ముఖ్యంగా దీపావళి అమవాస్య తర్వాత వచ్చే కార్తిక శుద్ధ చవితి నాడు కొలుస్తారు. దీనినే నాగుల చవితిగా తెలుగు రాష్ట్రాల్లో పండగగా జరుపుకుంటారు. అయితే.. మన పురణాల్లో నాగుల చవితి గురించి ఎన్నో గాధలు ఉన్నాయి. మనదేశమంతట పలు దేవాలయాల్లో నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి. అయితే.. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుడు శివుడికి వాసుకిగా.. శ్రీ మహావిష్ణువుకు శేషుడిగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి ఈ రోజు భక్తులు పూజ చేసి నైవేద్యాలను సమర్పించడం ద్వారా సర్వరోగాలు పోయి సౌభాగ్యులవుతారని విశ్వసిస్తారు.
read also:Shamshabad Accident: కాంగ్రెస్ నేత ఫేరోజ్ ఖాన్ ఇంట విషాదం.. రోడ్డుప్రమాదంలో కూతురు దుర్మరణం
అంటే.. కుజ దోషం, కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుభ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే.. యోగశాస్త్రం ప్రకారం మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి. దీనినే నవరంద్రాలు అని అంటారు. మన శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను వెన్నుపాము అని, అందులో కుండలినీ శక్తి మూలాధారచక్రంలో పాము ఆకారం వలే ఉంటుందని యోగశాస్త్రం చెబుతుంది. ఇదీ.. మానవ శరీరంలో నిద్రావస్థలో ఉంటూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సార్యాలనే విషాలన్ని చిమ్ముతూ మానవునిలో సత్వగుణ సంపత్తి హరించి వేస్తుందని.. అందుకే నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేత తత్వం పొందుతుందని, శ్రీహరికి తెల్లని శేషపాన్పుగా మారాలనే కోరికతో ఈ విధంగా చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి.. పుట్టలో పాలు పోయడానికి గల కారణం ఇదేనని పెద్దలు చెబుతుంటారు.
శ్రావణ మాసమంతటా పండుగల సందడితోనే సాగుతుంది. నేడు నాగుల చవితితో పర్వదినాలు ఆరంభమవుతాయి. రేపు గరుడ పంచమిని జరుపుకుంటారు. 5న వరమాలక్ష్మీ వ్రతం, 12న రక్షాబంధనం, 18, 19 తేదీల్లో వచ్చే శ్రీకృష్ణజన్మాష్టమితో పాటూ బలరామ జయంతి, హయగ్రీవ జయంతి, రాధాష్టమి పండుగలు వరుసగా ఆనందాలను తెచ్చేవే. కాగా..మాసం చివరిరోజున కూడా పొలాల అమావాస్యను జరుపుకోవడం.. వ్రతాలకు శ్రావణమాసాన్ని ఎంచుకోవడంలో ఆరోగ్యపరమైన కారణాలున్నాయని, ప్రత్యేక పూజలకు సన్నాహాలు చేస్తున్నట్లు వేదపండితులు చెబుతున్నారు.
Sanjay Raut: సంజయ్ రౌత్ అరెస్ట్.. దాదాపు 9గంటల పాటు విచారించిన ఈడీ