Nagula Panchami: తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ మాసం సందడి మొదలైంది. శ్రావణ మాసమంతటా పండుగల సందడితోనే సాగుతుంది. నేడు శ్రావణమాసం తొలి శుక్రవారం, నాగుల పంచమి పర్వదినం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకములు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి కి మహాభ్యంగనం తర్వాత షోడశోప చార పూజలు చేశారు. సాయంత్రం మహాలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. అలాగే రాజన్న ఆలయంలో స్వామివారికి అభిషేకములు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులకు, మహిళలకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.
Read also: Top Headlines @9AM : టాప్ న్యూస్
పురణాల్లో నాగుల చవితి..
మన పురణాల్లో నాగుల చవితి గురించి ఎన్నో గాధలు ఉన్నాయి. మనదేశమంతట పలు దేవాలయాల్లో నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి. అయితే.. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుడు శివుడికి వాసుకిగా.. శ్రీ మహావిష్ణువుకు శేషుడిగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి ఈ రోజు భక్తులు పూజ చేసి నైవేద్యాలను సమర్పించడం ద్వారా సర్వరోగాలు పోయి సౌభాగ్యులవుతారని విశ్వసిస్తారు. అంటే.. కుజ దోషం, కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుభ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే.. యోగశాస్త్రం ప్రకారం మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి. దీనినే నవరంద్రాలు అని అంటారు. మన శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను వెన్నుపాము అని, అందులో కుండలినీ శక్తి మూలాధారచక్రంలో పాము ఆకారం వలే ఉంటుందని యోగశాస్త్రం చెబుతుంది.
Read also: Bhatti Vikramarka: నేడు వైరాలో భట్టి విక్రమార్క పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
ఇదీ.. మానవ శరీరంలో నిద్రావస్థలో ఉంటూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సార్యాలనే విషాలన్ని చిమ్ముతూ మానవునిలో సత్వగుణ సంపత్తి హరించి వేస్తుందని.. అందుకే నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేత తత్వం పొందుతుందని, శ్రీహరికి తెల్లని శేషపాన్పుగా మారాలనే కోరికతో ఈ విధంగా చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి.. పుట్టలో పాలు పోయడానికి గల కారణం ఇదేనని పెద్దలు చెబుతుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవక్షేత్రాలైన శ్రీశైలం, వేములవాడ, తిరుపతి, విజయవాడ దుర్గమ్మ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. శ్రావణ మాస పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయా ఆలయాల్లో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన భద్రతా చర్యలతో పాటు భక్తుల సౌకర్యార్థం పలు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయాల్లో రోజువారీ పూజా కార్యక్రమాలు, ప్రత్యేక దర్శనాలు కొన్నింటిని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
Hyderabad Crime: పాతబస్తీలో దారుణ హత్య.. కళ్లలో కారం నీళ్లు చల్లి కాల్పులు..