Asaduddin Owaisi: ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్, ఓ కేసులో శ్రీ మహా విష్ణువు గురించి వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. విష్ణువు విగ్రహాన్ని పునరుద్ధరించాలనే పిటిషన్‌పై..‘‘ మీరు విష్ణువు భక్తులు కదా, విష్ణువునే ఏమైనా చేయమని అడగండి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్‌పై మరోసారి నిందితుడు రాకేష్ కిషోర్ పరుష వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో ప్రవర్తించిన తీరుకు ఏ మాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. పైగా తనకెలాంటి భయం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.