దేశంలో ఇకపై వ్యక్తులకు సంబంధించిన పర్సనల్ డేటా సురక్షితంగా ఉండనుంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును విపక్షాల ఆందోళనల నడుమ లోక్‌సభ సోమవారం ఆమోదించింది.
మహిళలపై జరుగుతున్న నేరాలు, మణిపూర్‌లో జాతి హింసపై కేంద్రం, ప్రతిపక్షాలు మరోసారి గొంతు చించుకున్నాయి. మణిపూర్‌లో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాల ఆరోపణలపై అనేక మంది ప్రతిపక్ష ఎంపీలు వరుసగా మూడు రోజుల పాటు లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ గట్టిగా వాయిదా నోటీసులు సమర్పించారు.
లోక్‌సభ 64 అధికారిక సవరణలతో ఆర్థిక బిల్లు-2023ని ఆమోదించింది. సీతారామన్ పార్లమెంట్‌లో ఫైనాన్స్ బిల్లు 2023ని ప్రవేశపెట్టారు. అదానీ సమస్యపై జేపీసీ విచారణను డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీల భారీ నినాదాల మధ్య చివరికి వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదించబడింది.
India in World Steel Production: ప్రపంచవ్యాప్తంగా ఉక్కు ఉత్పత్తిలో ప్రస్తుతం మన దేశమే నంబర్-2 పొజిషన్‌లో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గడచిన 8 ఏళ్లలో స్టీల్ ప్రొడక్షన్ రెట్టింపైందని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాజ్యసభలో వెల్లడించారు. ఇండియా చరిత్రలో ఎప్పుడూ ఈ స్థాయిలో పురోగతి చోటుచేసుకోలేదని చెప్పారు. 2013-14
శుక్రవారం ముగిసిన శీతాకాల సమావేశాల్లో తొమ్మిది బిల్లులను ఉభయ సభలు ఆమోదించాయి. డిసెంబర్ 7న సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన 13 సమావేశాల్లో తొమ్మిది బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
కేంద్రంలోని అధికార బీజేపీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రాజ్యసభ దద్దరిల్లింది. ఆయనవి అభ్యంతరకర వ్యాఖ్యలని, క్షమాపణ చెప్పాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేసింది. కానీ క్షమాపణ చెప్పేందుకు ఖర్గే ఖరాకండిగా ససేమిరా అన్నారు.
అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ వ్యవహారం పార్లమెంట్ ఉభయసభలనూ కుదిపేస్తోంది. సున్నితమైన భారత్-చైనా సరిహద్దు సమస్యపై చర్చకు ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ లోక్‌సభ ఎ