దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాజౌరీ గార్డెన్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న జంగిల్ జంబూర్ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో.. భారీగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి బయటకు పరుగులు తీశారు.