బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుపానును ఎదుర్కొనేందుకు కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తాజా పరిస్థితులను కేంద్రం సమీక్షించింది. ప్రాణ నష్టానికి అవకాశం లేకుండా.. ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలకు ఆదేశించింది. తుఫాను శనివారం ఉదయం నాటికి ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా ఏపీ, ఒడిశా రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.సముద్రంలో…