Fire Accident: హైదరాబాద్‌లో మరోసారి భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది. మంగళవారం (జనవరి 13) రాత్రి కూకట్‌పల్లి రాజీవ్ గాంధీ నగర్‌లోని ఓ గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్ రీఫిల్లింగ్ జరుగుతున్న సమయంలో గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మంటలు…