నటులు, నటీమణులు, రాజకీయ నాయకులకి దేవాలయాలు నిర్మించి విగ్రహాలను ప్రతిష్టించి దేవుళ్లలా పూజిస్తున్నారు కొందరు. నటుడు రజనీకాంత్‌కు తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో నటుడు రజనీకాంత్ నేడు తన పుట్టినరోజు జరుపుకోనున్నారు. రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని అభిమానులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మదురై జిల్లా తిరుమంగళానికి చెందిన కార్తిక్ అనే మాజీ సైనికుడు రజనీకాంత్ కోసం నిర్మించిన ఆలయంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నటుడు రజనీకాంత్‌కి కార్తీక్…