సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రముఖ దర్శకుడి ట్యాలెంట్ కు ఫిదా అయ్యారట. అందుకే ఆయనకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం “అన్నాత్తే”. ఫ్యామిలీ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాకు సిరుత్తై శివ దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా ఈ చిత్రం నవంబర్ 4న విడుదలై, మంచి విజయాన్ని సాధించింది. తమిళనాట కురిసిన భారీ వర్షాలు సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపించాయి.…