ఒక సాధారణ బస్సు కండక్టర్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది.. సూపర్‌స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్ సినీ ప్రస్థానం అసాధారణం. కోట్ల మంది అభిమానులు ఆరాధించే రజనీకాంత్ జీవిత కథ (బయోపిక్) ఎప్పుడు వెండితెరపైకి వస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ విషయంపై రజనీ కుమార్తె ఐశ్వర్య క్లారిటీ ఇచ్చి అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపారు. తన తండ్రి ఆటోబయోగ్రఫీకి సంబంధించిన చిత్ర పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఆమె అధికారికంగా వెల్లడించారు.…