(జూలై 20న రాజేంద్రకుమార్ జయంతి) చిత్రవిచిత్రాలకు నెలవు చిత్రసీమ. వద్దనుకున్నా కొందరిని అందలమెక్కిస్తుంది. కోరుకున్నా మరికొందరినీ తారాపథానికి దూరంగానే నిలుపుతుంది. ప్రఖ్యాత హిందీ నటుడు రాజేంద్రకుమార్ చిత్రసీమలో రాణిస్తే చాలు అనుకొని కాలుపెట్టారు. కానీ, ఆయన ఊహించని విధంగా నటుడయ్యారు, హీరో అనిపించుకున్నారు, స్టార్ హీరోగా జేజేలు అందుకున్నారు. వరుస రజతోత్సవాలతో ‘జూబిలీ కుమార్’ అనీ పిలిపించుకున్నారు. హిందీ చిత్రసీమలో రాజ్ కపూర్, దిలీప్ కుమార్, దేవానంద్ టాప్ స్టార్స్ గా రాజ్యమేలుతున్న రోజుల్లో రాజేంద్రకుమార్ సైతం…