Diya Kumari: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బీజేపీ సంచలన వ్యక్తిని ప్రకటించింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్‌లాల్ శర్మని సీఎంగా ఎంపిక చేసింది. ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా రాజకుటుంబ నేపథ్యం ఉన్న దియా కుమారిని, ఎస్సీ వర్గానికి చెందిన ప్రేమ్ చంద్ బైర్వాలు ఎన్నికయ్యారు. అయితే, ముందుగా మాజీ సీఎం వసుంధర రాజేని స్థానంలో దియాకుమారి సీఎం అవుతారనే ప్రచారం జరిగింది. చివరకు ఉపముఖ్యమంత్రి పదవి దియాకుమారిని వరించింది.