రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. త్వరలో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే, నాయకుల మధ్య అంతర్గత విభేదాలు పార్టీకి మైనస్ గా మారింది. ముఖ్యంగా సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య చెలరేగిన వివాదం తారా స్థాయికి చేరింది.
రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో రుణాల చెల్లింపుల కోసం బాలికలను వేలం వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై విచారణ కోసం జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యూ) శుక్రవారం ఇద్దరు సభ్యులతో నిజ నిర్ధారణ బృందాన్ని ఏర్పాటు చేసింది.