ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు కఠినంగా వ్యవహరించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జులై లో అత్యధిక వర్షం నమోదు అయ్యిందని పేర్కొన్నారు.ప్రాథమిక సమాచారం ప్రకారం సాధారణం కంటే 450 శాతం ఎక్కువ గా వర్ష పాతం నమోదైందని తెలిపారు. జిల్లాలో పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్ మాదిరి అసాధారణ పరిస్థితులు లేవని తెలిపారు. అయినా ఉదాసీనంగా, ఆలక్ష్యంగా ఉండొద్దని సూచించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని, ఆస్తి నష్టం కనిష్టానికి తగ్గించేలా చూడాలని…
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం కావడంతో భక్తులతో కిక్కిరిసింది. పలు ప్రాంతాల నుంచి తరలిరావడంతో.. సర్వదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయానికి చేరుకున్నారు భక్తులు. ఈసందర్భంగా ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని తరించారు భక్తజనం. స్వామి వారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును ఎంతో భక్తితో చెల్లిచుకున్నారు. ఆలయంలోని కళాభవన్ లోని స్వామివారి నిత్య కల్యాణం, సత్యనారాయణ వ్రతం తదితర ఆర్జిత సేవలలో భక్తులు భక్తితో హాజరయ్యారు. భక్తులు వారి తలనీలాలు సమర్పించే భక్తులతో కల్యాణ…
పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో నేడు పర్యటించనున్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డి పేట, గంభీరావుపేట, సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు కేటీఆర్. ఉదయం 11 గంటలకు సిరిసిల్ల పట్టణంలోని రెడ్డి సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. 11.30 నిమిషాలకు జిల్లా రెడ్డి సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరవుతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కలెక్టరేట్‌లో జిల్లా న్యాయవాదులతో సమావేశమవుతారు. 1.30 గంటలకు ఎల్లారెడ్డిపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం…
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌లో రాజకీయాలు వినూత్నంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు మరోసారి పోటీ చేస్తారా లేక.. ఆయనకు బదులుగా కొత్తగా పార్టీలో చేరిన చల్మెడ లక్ష్మీ నరసింహరావుకు టికెట్ ఇస్తారా అనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇద్దరు నాయకులు వేములవాడలో పోటాపోటీగా సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. అదే స్పీడ్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అది కేడర్‌ను మరింత గందరగోళంలోకి నెడుతోందట. కొంతకాలంగా ఎమ్మెల్యే రమేష్ పౌరసత్వంపై వివాదం చెలరేగుతోంది. సమస్య కోర్టు…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల వల్ల జరిగిన నష్టం రాష్ట్ర ఐటీ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. వర్షానికి తడిసిన ధాన్యం వివరాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని అడిగి తెలుసుకున్నారు. వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని కేటీఆర్ కు జిల్లా కలెక్టర్ వివరించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వాలని, జిల్లా కలెక్టర్ కు మంత్రి కేటీఆర్ సూచించారు. జిల్లాలోని ఎల్లారెడ్డి పేట, వీర్నపల్లి మండలాల…
తెలంగాణలో ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ముగ్గురికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని అధికారులు వెల్లడించారు. ఇటీవల దుబాయ్ నుంచి ముస్తాబాద్ మండలానికి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. అయితే అతడి భార్య, తల్లితో పాటు స్నేహితుడికి కూడా ఒమిక్రాన్ లక్షణాలు కనిపించడంతో అధికారులు టెస్టులు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. Read Also: తీన్మార్ మల్లన్నపై ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు తాజాగా నమోదైన మూడు…
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఇండియాలో పలు చోట్ల ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ వేరియంట్ కేసులు తెలుగు రాష్ట్రాలలోనూ నమోదవుతున్నాయి. ఏపీతో పోలిస్తే తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. గల్ఫ్ నుంచి వచ్చిన వ్యక్తికి మూడురోజుల క్రితం ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో బాధితుడిని హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. Read…
తెలంగాణలో దక్షిణాఫ్రికా కరోనా వేరియంట్ ఒమిక్రాన్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈనెల 16న దుబాయ్ నుంచి స్వగ్రామం గూడెంకు వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ లక్షణాలు కనిపించడంతో వెంటనే హైదరాబాద్ టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. టెస్టులు నిర్వహించగా అతడికి ఒమిక్రాన్ పాజిటివ్ అని నిర్ధారించారు. దీంతో వైద్యులు బాధితుడికి చికిత్స అందిస్తున్నారు. Read Also:…
వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంతో పాటు పట్టణంలో రూ.70 నుంచి రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వేములవాడ ఎమ్మెల్యే సీహెచ్ రమేష్‌బాబు తెలిపారు. ఇటీవల రూ.20 కోట్లు మంజూరయ్యాయని, దశలవారీగా అన్ని పనులు పూర్తి చేస్తామని తెలియజేశారు. వేములవాడ ఆలయ అభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షుడు ఎం.పురుషోత్తంరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్‌బాబు మాట్లాడుతూ 167 ఎకరాల్లో రూ.91.68 కోట్లతో ఆలయ ట్యాంకు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. బండ్ నిర్మాణానికి…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యానికి ఓ మహిళ బలైంది. దీంతో ఆమె నాలుగేళ్లుగా నరకం అనుభవిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్‌కు చెంది లచ్చవ్వ అనే మహిళ తీవ్ర నడుం నొప్పితో బాధపడుతోంది. దీంతో స్థానిక వైద్యుల వద్దకు వెళ్లి వైద్యం చేయించుకుంది. అయినా తగ్గకపోగా.. సమస్య మరింత జఠిలంగా మారింది. కానీ వైద్యులకు ఆమె సమస్య అంతుబట్టలేదు. ఆమెది సహజ నొప్పి అని భావించి మెడిసిన్స్ ఇస్తున్నారు. సుమారు రూ.4…