Fake Currency: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని పొదుపు మహిళా సంఘాల్లో నకిలీ నోటు కలకలం సృష్టించింది. బ్యాంకు నుంచి వడ్డీ లేని రుణాలు పొందిన మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను ప్రతి నెల చెల్లించాల్సి ఉంటుంది. అయితే నగదు చెల్లించే క్రమంలో సభ్యుల నుంచి వస్తున్న 500 రూపాయల నోట్ల వ్యవహారం ప్రస్తుతం మహిళా సంఘాల ప్రతినిధులకు భయాందోళన గురిచేస్తోంది. వేములవాడ పట్టణంలోని ఓ మహిళా పొదుపు సంఘానికి చెందిన సభ్యులు…