సీఎం కేసీఆర్ న్నాయకత్వంలో తెలంగాణలో చిరస్మరణీయంగా కొన్ని పథకాలు నిలిచిపోయాయి అని ప్రశంసలు కురిపించారు మంత్రి కేటీఆర్.. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మల్కాపేటలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చల్మెడ జానకి దేవి స్మారకార్థం సుమారు రూ. 2 కోట్లతో నిర్మించిన పాఠశాల భవనాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. విపక్షాలపై విరుచుకుపడుతూనే రాష్ట్రంలో అమలు అవుతోన్న సంక్షేమ పథకాలను…
మహా శివరాత్రి వచ్చేస్తోంది.. దీంతో.. శైవ క్షేత్రాల్లో ఇప్పటికే మహా శివరాత్రి 2022 బ్రహ్మోత్సవాలు, శివరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.. ఇక, రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలోనూ మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు.. ఇవాళ వైభవంగా రాజన్నసన్నిధిలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాగా.. నేటి నుండి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు.. మార్చి 1 తేదీన మహా శివరాత్రి పర్వదినాన రాజన్న దర్శనానికి భారీ ఎత్తున ప్రజలు తరలివస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు..…
రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో సోమవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్‌రూం ఇండ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వసతులతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం దేశానికి ఆదర్శమని ఆయన అన్నారు. రాష్ట్రంలో రూ.18 వేల కోట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, అతి త్వరలో అందరికీ ఇండ్లు అందజేస్తామని ఆయన వెల్లడించారు. ఒక్క పైసా తీసుకోకుండా ప్రజలకు…
సమ్మక్క-సారక్క జాతర ముగియగానే ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గురువారం తెలిపారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. “నీతి ఆయోగ్ యొక్క 2019-20 ఆరోగ్య సూచీలో పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం మూడవ స్థానాన్ని పొందగా, బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ దిగువన ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రకటించింది. రాష్ట్ర…