సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే! త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేశ్ చేయనున్న సినిమా ముగిసిన అనంతరం.. ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది పట్టాలెక్కడానికి చాలా సమయమే ఉన్నప్పటికీ.. ఇందుకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ మాత్రం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమా దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతవరకూ…
దిగ్గజ స్వరకర్త ఇళయరాజా, ప్రముఖ సినీ నిర్మాత విజయేంద్ర ప్రసాద్ బుధవారం రాజ్యసభకు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. నామినేషన్ల అనంతరం ప్రతిష్టాత్మకంగా నిలిచిన కళాకారులకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. రాజ్యసభకు అర్హులైన ప్రముఖులను ఎంపిక చేసినందుకు ప్రధాని మోదీకి మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. సినిమా పరిశ్రమకు చెందిన అత్యంత అర్హులైన ప్రముఖులైన కె.వి.విజయేంద్ర ప్రసాద్, ఇళయరాజాలకు రాజ్యసభ సభ్యులుగా రాష్ట్రపతి నామినేషన్‌కు అర్హమైన గౌరవాన్ని అందించినందుకు గౌరవప్రదమైన ప్రధాన మంత్రి…
స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘RRR’ మూవీ ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఎంత గుర్తింపు పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కలెక్షన్లలో రికార్డులు బద్దలుకొట్టిన ఈ చిత్రం మార్చి 25న విడుదలై నేటితో 100 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో ఒకవైపు బైక్‌పై ఎన్టీఆర్…
‘సర్కారు వారి పాట’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తన తదుపరి సినిమాల్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో SSMB28 సినిమా చేస్తోన్న మహేశ్, ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో సెట్స్ మీదకి వెళ్లనున్నాడు. ఈ సినిమాకి ఆయన రెండేళ్ల బల్క్ డేట్స్ కూడా ఇచ్చేశాడు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాదిలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. దీని తదనంతరం తన 30వ ప్రాజెక్ట్…
తమ కెరీర్ లో కనీసం ఒక్కసారైన దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో పని చేయాలని నటీనటులు కోరుకుంటారు. స్టార్ నటులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. జక్కన్న ఓకే అంటే, కుండపోతగా తమ డేట్స్ ఇచ్చేందుకు ఎందరో సిద్ధంగా ఉన్నారు. అలాంటిది.. స్వయంగా జక్కన్నే తన వద్దకు వచ్చి ‘బాహుబలి’లాంటి ఆఫర్ చేస్తే, రిజెక్ట్ చేశాడో నటుడు. ఇంతకీ, అతనెవరని అనుకుంటున్నారా? కరోనా లాక్డౌన్ సమయంలో ఎందరో పేదవాళ్లకు సహాయం చేసి రియల్ హీరోగా అవతరించిన సోనూ…