Brahmastra: దర్శక ధీరుడు రాజమౌళి ఏదైనా అనుకున్నాడంటే దాన్ని సక్సెస్ చేయక మానడు. అది సినిమా అయినా, ప్రమోషన్స్ అయినా.. ఇటీవలే జక్కన్న బ్రహ్మాస్త్ర తెలుగు ప్రమోషన్స్ ను తన భుజస్కంధాలపై వేసుకున్న విషయం విదితమే. ఈ సినిమా మరీ భారీ విజయాన్ని అందుకోక పోయినా ఒక మోస్తరు విజయాన్ని అయితే చేజిక్కించుకొంది. గుడ్డిలో మెల్ల అన్నట్లు బాలీవుడ్ లో ఇప్పుడు ఇదే పెద్ద సక్సెస్. ఆ విజయానికి కారణం ఒక విధంగా రాజమౌళి అని చెప్పొచ్చు. తన ప్రమోషన్స్ స్ట్రాటజీని ఈ సినిమాకు కూడా అప్లై చేశాడు. అయితే ఈ ప్రమోషన్స్ ను జక్కన్న ఊరికే చేయలేదాని, ఇందుకోసం బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్, రాజమౌళికి రూ. 10 కోట్లు ముట్టజెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక తాజాగా ఈ వార్తలపై ధర్మ ప్రొడక్షన్స్ సన్నహితులు స్పందించారు. ఇవన్నీ పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశారు. కరణ్ జోహార్, బాహుబలిని హిందీలో డిస్ట్రిబ్యూట్ చేశారు. అందుకు సాయంగా జక్కన్న ఈ పనికి ఒప్పుకున్నారు. అంతేతప్ప ఈ పని చేయడానికి ఆయన ఒక్క రూపాయి ని కూడా ఆశించలేదని చెప్పుకొచ్చారు. ఇక ఇదే విషయాన్ని రాజమౌళి ప్రమోషన్స్ లో ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు. కథ నచ్చి మాత్రమే ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నాను.. నా సినిమాలకు, కరణ్ సినిమాలకు చాలా తేడా ఉంది. బాహుబలి కి కరణ్ ఎంతో హెల్ప్ చేశాడు. దానివలనే ఈ సినిమాకు నేను హెల్ప్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ పుకార్లకు చెక్ పడినట్లు అయ్యింది.