పాన్ ఇండియా సినిమాలను శాసిస్తున్న దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళి నెంబర్ వన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు బాలీవుడ్ దర్శకులు, హీరోలు తెలుగు సినిమాలను తక్కువగా చూసిన పరిస్థితుల నుంచి, తెలుగు సినిమా ఇండస్ట్రీని టాప్ లెవెల్‌కు తీసుకెళ్లిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్థాయినే మార్చేసిన రాజమౌళి, అప్పటి నుంచి ఇండియాలోనే టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆయన డైరెక్షన్‌లో నటించాలనే కోరిక దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి స్టార్ హీరోకు…