Rajamouli: నా రెండు సినిమాలు సూర్య మిస్ అయ్యాడు.. రాజమౌళి కామెంట్స్ వైరల్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా సినిమాలను శాసిస్తున్న దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళి నెంబర్ వన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు బాలీవుడ్ దర్శకులు, హీరోలు తెలుగు సినిమాలను తక్కువగా చూసిన పరిస్థితుల నుంచి, తెలుగు సినిమా ఇండస్ట్రీని టాప్ లెవెల్‌కు తీసుకెళ్లిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్థాయినే మార్చేసిన రాజమౌళి, అప్పటి నుంచి ఇండియాలోనే టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆయన డైరెక్షన్‌లో నటించాలనే కోరిక దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి స్టార్ హీరోకు ఉందంటే అతిశయోక్తి కాదు. అలాంటిది..
Also Read : Jana-Nayagan : విజయ్ ‘జన నాయగన్’కు స్పెషల్ టచ్..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
తాజా బజ్ ప్రకారం, తమిళ స్టార్ హీరో సూర్యతో రాజమౌళి రెండు సినిమాలు చేయాలనుకున్నారట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టులు వర్కౌట్ కాలేదని సమాచారం. ఆ రెండు సినిమాలేంటంటే రవితేజ హీరోగా వచ్చిన ‘విక్రమార్కుడు’, రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘మగధీర’. మొదట ఈ కథలను సూర్యతో చేయాలని రాజమౌళి అనుకున్నప్పటికీ, అప్పటి పరిస్థితులు, భాషా పరమైన అంశాల కారణంగా తెలుగు హీరోలతోనే ఈ సినిమాలు చేయడం సరైనదని నిర్ణయించుకున్నారట. ఆ తర్వాత ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్స్‌గా నిలవడం తెలిసిందే. ఒక వేల కనుక ఈ సినిమాలు సూర్యకు పడి ఉంటే, ఆయన కెరీర్ పూర్తిగా మరో స్థాయికి వెళ్లేదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి నుంచి రాజమౌళి దర్శకత్వంలో చిన్న అవకాశం వచ్చినా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నానని సూర్య పలుమార్లు చెప్పినట్లు టాక్. మరి భవిష్యత్తులో అయినా ఈ క్రేజీ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా? లేదా అనేది చూడాల్సిందే.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?